గత ఏడాది ఖరీఫ్ లొ పంటలు సాగు చేసి ఈ క్రాప్ నమోదు చేయించుకున్నా పంటల బీమా వర్తించని రైతులుంటే రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఏఓ శుభకర్, హార్టికల్చర్ అధికారి రత్నకుమార్ తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. 2021 ఖరీఫ్ గాను మండలంలో వివిధ పంటలకు సుమారు రూ. 17. 49 కోట్ల బీమాను ప్రభుత్వం వర్తింపచేసినట్లు అధికారులు వెల్లడించారు.