ఇంకా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. కరోనా అనంతర సమస్యలతో సోనియా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముక్కు నుంచి రక్తం రావడంతో ఈ నెల 12వ తేదీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో సోనియా చేరారని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స చేశారని చెప్పింది. గురువారం ఉదయం మరోసారి ఆమెకు పరీక్షలు నిర్వహించారని తెలిపింది.
ఈ క్రమంలో సోనియా శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దానితో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. సోనియా ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని తెలిపింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (సమాచారం) జైరాం రమేశ్ లేఖ విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa