రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన జరుగుతోంది. ధర్మమైన, అవినీతి లేని పాలన సాగుతోంది. ఇవి చూసి భరించలేని చంద్రబాబు, మళ్లీ అధికారంలోకి రామని తెలియడంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రైతు భరోసా, వైయస్సార్ చేయూత, అమ్మ ఒడి అనే పథకాలు ఉన్నాయా? అవేవీ లేవు. అయినా అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. వారికున్న మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. ఈ మూడు ఒక ఉద్యమం చేపట్టాయి. చెడు వార్తలు రాయడం. జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద విషం చిమ్మడం. ప్రజల మైండ్ మార్చడం. వారిని చంద్రబాబు వెంట నడిపించాలనే ప్రయత్నం. ఒక చెడు ఉద్యమానికి పునాదులు వేసి, అదే పనిగా రాస్తున్నారు. మహిళలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రజల్లో చర్చకు రావొద్దని, తెలుగుదేశం పార్టీ వారే ఏదో ఒక అఘాయిత్యం సృష్టించడం, దాన్ని వైయస్సార్ కాంగ్రెస్‌కు అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ‘ఎల్లో విషం’ చిమ్ముతున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎల్లో మీడియా కధనాలనుమంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగిస్తున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక 40 ఏళ్ల రాజకీయ జీవితమని చెప్పుకునే చంద్రబాబు బూతు పురాణానికి తెగబడ్డారని ధ్వజమెత్తారు.