కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్'ను వెనక్కి తీసుకోవాలని బీహార్‌లో యువకులు శనివారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో 12 జిల్లాలలో పోలీసులు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేశారు. ఇక శుక్రవారం బీహార్ డిప్యూటీ సీఎం రేణుదేవి, బీహార్ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ సంజయ్ జైస్వాల్ ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. అటువంటి పరిస్థితులు శనివారం ఉత్పన్నం కాకుండా దేశవ్యాప్తంగా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.