అగ్నిపథ్ పై ఆదివారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేయనుంది. జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నారు. రైతుచట్టాల తరహాలో అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోడీ యువత బాధను వినిపించుకోవాలన్నారు. రేపు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, ఆర్మీ అభ్యర్దులకు అండగా నిలవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.