రేషనలైజేషన్ విధివిధానాలపై తిరుపతి, పుత్తూరు అధికారులు, ప్రధానోపాధ్యాయులతో డీఈవో శేఖర్ సమీక్ష నిర్వహించారు. రామచంద్రాపురం మండలంలోని ఓ పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఉన్నత పాఠశాల ఒక కిలో మీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలోకి కలవడం జరుగుతుందన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నతలో కలపతారన్నారు.