'అగ్నిపథ్'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ ఒడిశా యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ యువకుడు నరేష్ బిశ్వాస్ (23) అగ్నిపథ్‌పై 60 కి.మీ. మారథాన్ రన్‌తో నిరసన తెలియజేశాడు. 5 గంటల 26 నిమిషాల్లో తన పరుగు పూర్తి చేశాడు. తాను ఎం.కామ్ చదివినా ఉద్యోగం లేక కూలి పని చేసుకుంటున్నట్లు వివరించాడు. అగ్నిపథ్‌తో తనలాంటి వారు ఎందరో ఉద్యోగాలు రాక కూలికి వెళ్లాల్సి వస్తుందని వాపోయాడు.