ప్రేమ పేరుతో మోసం చేశాడని ఒడిశాలో బీజేడీ ఎమ్మెల్యేపై ఓ యువతి కేసు పెట్టింది. జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోర్ ఎమ్మెల్యే విజయశంకర్ దాస్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నానని సోనాలిక అనే యువతి పేర్కొంది. తమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని, శుక్రవారం రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లికి సిద్ధమవగా ఎమ్మెల్యే రాలేదని వాపోయింది. తాను ఫోన్ చేసినా స్పందించక పోవడంతో శనివారం కేసు పెట్టినట్లు వివరించింది.