అగ్నిపథ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ బాధ్యుడు డా.రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మాచర్ల పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత శాఖలను సంప్రదించకుండా కేంద్రం హడావిడిగా తీసుకువచ్చిన అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.