విహార యాత్రకు వచ్చి నిజాంపట్నం సముద్రంలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యమైంది. తెనాలికి చెందిన షాహిద్(6) మృతదేహం సముద్రం ముఖద్వారం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో లభ్యమైనట్లు నిజాంపట్నం ఎస్ ఐ శివప్రసాద్ తెలిపారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందగా బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.