గ్రానైట్ క్వారీ గుంతలో ఈతకు దిగిన కార్మికుడు గల్లంతయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన అనూజ్ రవి(19) గ్రానైట్ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. స్నేహితునితో ఆర్ ఎల్పురం పరిధిలోని నిలిపి వేసిన క్వారీ గుంతలో ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగి ఎంతసేపటికి పైకి రాకపోవడంతో స్నేహితుడు సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లారు. చీకటవ్వడంతో ఆదివారం గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు ఎస్సై వి. ఆంజనేయులు తెలిపారు.