నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటిని దౌర్జన్యంగా కూల్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం ట్విట్టర్లో సీఎం జగన్ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. నర్సీపట్నం పులిని చూసి, పులివెందుల పిల్లి భయపడినట్లుందని పేర్కొన్నారు. జగన్ దుస్థితి చూస్తుంటే తనకు జాలేస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలోకొచ్చి మూడేళ్లుగా కూల్చివేతలు తప్పా వైసీపీ సర్కారు ఇంకేమీ చేయలేదన్నారు.