సినీ నటి సాయి పల్లవికి నటుడు ప్రకాశ్ రాజ్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. కశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యలపై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి సాయి పల్లవికి మద్దతుగా నిలుస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ప్రకటన చేశారు. మానవత్వమే అన్నింటికంటే ముందు... కాబట్టే సాయి పల్లవి మేము నీతోనే ఉన్నాం అంటూ ఆయన ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. రానాతో కలిసి తాను నటించిన విరాట పర్వం చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఎవరి పక్షం అంటూ ఓ ప్రశ్న ఎదురు కాగా... ఆ ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో సాయి పల్లవి కశ్మీర్ పడింట్లు, గో హత్యలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగగా... దానిపై సాయి పల్లవి శనివారం వివరణ ఇచ్చారు. ఈ వివరణ చూశాక సాయి పల్లవికి మద్దతు ప్రకటిస్తూ ప్రకాశ్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa