బీహార్ రాష్ట్రంలో ఆదివారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. దీంతో మొత్తం 17 మంది దుర్మరణం పాలయ్యారు. దీనిపై బీహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి, రూ.4 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులు బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.