ముస్లిం బాలికల పెళ్లి విషయంలో పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. షరియా చట్టం ప్రకారం ముస్లిం అబ్బాయిలకు పెళ్లి వయసు 21 ఏళ్లని, బాలికలకు 16 ఏళ్లని తాజాగా స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుని, పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది. వారి కేసులో తీర్పునిస్తూ జస్టిస్ జస్జిత్ సింగ్ బేటీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.