తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన మారిముత్తు (25)కు ఫేస్బుక్లో రాగిణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. కొంత కాలం క్రితం ఆమెకు రూ.5 లక్షల రుణాన్ని మారిముత్తు ఇప్పించాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరి సాయంతో ఇటీవల హతమార్చింది. మృతుడి సెల్ఫోన్ ద్వారా ట్రేస్గా శనివారం ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాగిణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.