కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో ఈనెల 23వ తేదీన కనిగిరి నియోజకవర్గ స్థాయిలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో పార్టీ పరమైన అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.