బి.సి. లే నా మొదటి ప్రాధాన్యం, బిసిల సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తున్నానని డాంభీకాలు చెబుతున్న ముఖ్యమంత్రి బి.సి నేతలపై కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని టీడీపీ నాయకులూ అయ్యన్న పాత్రుడు ఇంటి కూల్చివేతపై స్పందిస్తూ గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అధికారులు చెప్పినట్లు ఇంటి నిర్మాణంలో అవకతవకలు ఏమైనా ఉంటే ముందస్తుగా నోటీసు ఇవ్వాల్సి ఉంది కాని ఎవ్వరికి నోటీసు ఇవ్వకుండా అయ్యన్న ఇంటి ప్రహరీగోడ కూల్చడం దుర్మార్గం, అయ్యన్న గారిపై ప్రభుత్వం తీసుకున్న ఈ కక్షపూరితమైన దోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన తెలియజేసారు.