ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి 100వ జయంతి, తన 60 జన్మదినాన్ని పురస్కరించుకుని కీలక ప్రకటన చేశాడు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే రోజుల్లో రూ.60,000 కోట్లతో సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.