మధ్యప్రదేశ్‌లోని సీదీ జిల్లా బడా గ్రామానికి చెందిన రాజకుమారి (20) భక్తిలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులతో కలిసి గురువారం స్థానిక అమ్మవారి ఆలయానికి వెళ్లింది. అందరూ చూస్తుండగానే నాలుక కోసుకుని, అమ్మవారి పాదాల చెంత విసిరేసింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్న భక్తులు గగ్గుర్పాటుకు గురయ్యారు. ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లగా వైద్యులు చికిత్స అందించారు. ప్రాణాపాయం లేదని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa