కర్నాటకలోని ముదలగి పట్టణ బస్టాండ్‌లో శుక్రవారం కలకలం రేగింది. బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడు పిండాల అవశేషాలతో కూడిన ఓ బాక్సును వదిలి వెళ్లాడు. లింగనిర్ధారణ చేసిన తర్వాత భ్రూణ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా ఆరా తీశారు. ఆ అవశేషాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa