ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారి ప్రొబేషన్ డిక్లరేషన్‌కు శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి జీవోను విడుదల చేసింది. దీంతో ఇక నుంచి ఉద్యోగులకు కొత్త పేస్కేల్ ప్రకారం ప్రభుత్వం జీతాలు చెల్లించనుంది. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకుని, పరీక్షలో ఉత్తీర్ణులైన వారంతా ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంతోషంలో మునిగి పోయారు.