కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. మొత్తం 11 మంది సీనియర్ విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఫస్టియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. దీంతో బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. విచారణలో ర్యాగింగ్ చేయలేదని, ఇంటరాక్షన్ పేరుతో ఇబ్బంది పెట్టారని కమిటీ సభ్యులు చెబుతున్నారు.