తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కనిపిస్తే కొట్టండి అని ప్రజలకు అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పిలుపునిచ్చారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం హుకుంపేట మండలంలోని తీగలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకు ఇళ్లు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే గిరిజనులకు ఇళ్లు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, వాటిని ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందువల్లే ఇళ్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాదు, ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని వారికి సూచించారు.