ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముగ్గురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధి బృందం రేపు త్రిపురలో పర్యటించనుంది.ఆదివారం అగర్తలాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో త్రిపుర పీసీసీ చీఫ్ బిరాజిత్ సిన్హా సహా కనీసం 19 మంది గాయపడ్డారు.కాంగ్రెస్ ప్రతినిధి బృందంలో సీనియర్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, నాసిర్ హుస్సేన్ ఉన్నారు. వారు ఘటనపై నివేదిక సమర్పించనున్నారు.