విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయడానికి ముందు ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం పార్లమెంట్లో సమావేశం కానున్నారు.మహారాష్ట్ర సంక్షోభంపై నిప్పులు చెరుగుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశానికి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీయే తన అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాలకు పరీక్ష ఎదురైంది.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో సోమవారం జరిగే సమావేశానికి విపక్షాల నుంచి ఎవరెవరు హాజరవుతారనేది పెద్ద ప్రశ్న.