ప్రజలంతా మత్తు పదార్థాలైన గంజాయి ఖైనీ, గుట్కా, నాటుసారా, మద్యం, పొగాకులకు దూరంగా ఉండాలని గ్రంథాలయ అధికారి జయరాం విద్యార్థులు, గ్రామ ప్రజలను కోరారు. ఆదివారం కొత్త చెరువులోని గ్రంథాలయంలో చదవడం మాకు ఇష్టం అనే సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా డ్రగ్స్ వినియోగం, అమ్మకం, రవాణా నిషేధించారని తెలిపారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.