సైన్యంలో చేరాలనుకునే వారికి అగ్నిపథ్ పథకం కింద వాయుసేనలో నియామక ప్రక్రియ కు శుక్రవారం ప్రారంభం కాగా, ఆదివారం నాటికి మూడు రోజుల వ్యవధిలోనే 59,960 దరఖాస్తులు వచ్చినట్లు వాయుసేన ప్రకటించింది. దేశం లోని పలు ప్రాంతాల్లో అగ్నిపథ్ పై నిరసనలు ఎదురవుతున్న తరుణంలో ఈ స్థాయిలో అభ్యర్థుల నుంచి స్పందన రావడం విశేషం. ఈ రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ జూలై 5వ తేదీన ముగుస్తుందని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.