రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా హాజరుకానుంది. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఇక ఇప్పటికే ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఎటు వైపు అనే విషయాన్ని స్పష్టం చేయలేదు.