గ్రూప్-డి ఉద్యోగుల కోసం అమరావతిలో నిర్మిస్తున్న భవనాలను అద్దెకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు సోమవారం ఓ ప్రకటన ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో అమరావతిని రాజమౌళి సినిమాలోని గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు వాటిని అద్దెకు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవన సముదాయాన్ని ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఏది దొరికితే అది అమ్మివేసే పనిలో ప్రభుత్వం ఉందని, కుదరకపోతే ఇలా అద్దెకిచ్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.