ATM కేంద్రాలకు వచ్చే వృద్దులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని, వారికి సహాయ పడుతున్నట్లుగా నటించి, వారి PIN నంబర్ల తెలుసుకొని, వారి ATM కార్డులను మార్చి, బ్యాంకు ఖాతాల నుండి ఎ.టి.ఎం. కార్డులు ఉపయోగించి, మోసాలకు పాల్పడే ఘరాన మోసగాడ్ని విజయనగరం 2వ పట్టణ పోలీసులు జూన్ 25న అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన కూరంగి విద్యాసాగర్ వద్ద నుండి 14 కేసుల్లో రూ.2.30 లక్షల నగదు, 26 గ్రాముల రెండు బ్రాస్లెట్స్, ఎ.టి..ఎం. కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన అధికారులను దీపికా IPS, అభినందించారు.