వర్షాకాలంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దోమల వల్ల చికెన్ గున్యా వచ్చే ప్రమాదం ఉంది. ఎల్లో ఫీవర్ అనేది దోమల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అదేవిధంగా టైఫాయిడ్ కూడా వర్షాకాలంలోనే ఎక్కువగా వచ్చే సాధారణ వ్యాధి. కలుషితమైన, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటే ఇది వచ్చే ప్రమాదం ఉంది. సీజనల్ ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దోమలపట్ల అప్రమత్తంగా ఉంటూ అవి రాకుండా చర్యలు తీసుకోవాలి.