ఏపీ సీఎం జగన్ సోమవారం శ్రీకాకుళంలో అమ్మఒడి మూడో విడత నిధులను విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువే నిజమైన ఆస్తి అని అన్నారు. మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,617 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు. స్కూళ్ల బాగోగుల కోసమే అమ్మఒడిలో రూ.2వేలు కేటాయించామని అన్నారు.