మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. షిండే క్యాంపులో ఉన్న 8 మంది మంత్రుల శాఖలను తొలగిస్తూ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో శివసేన సర్కార్ మైనార్టీలో పడింది. రోజుకో విధంగా మహారాజకీయం మలుపు తిరుగుతుంది. చివరికి శివసేన కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.