అనంతపురం జిల్లాలో ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS మాట్లాడుతూ... పిటీషనర్ల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు... నిర్ణీత సమయంలో పూర్తీ చేయండి అని ఆదేశాలు జారీ చేసారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన " స్పందన " కార్యక్రమంలో 88 పిటీషన్లు స్వీకరణ. ప్రతీ పిటీషనర్ తో జిల్లా SP ముఖాముఖిగా మాట్లాడి సమగ్రంగా విన్నారు. చట్టపరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు. దేవా చారిటబుల్ ట్రస్టు సహకారం ద్వారా పిటీషనర్లు, వారి సహాయకులకు ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసారు.