మహారాష్ట్రలో శివసేన రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. జూలై 11 వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. 5 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు సరైన కారణం లేకుండా సీఎంపై అవిశ్వాసం ఏమిటని రెబెల్ ఎమ్మెల్యేలను సుప్రీం ప్రశ్నించింది. తదుపరి విచారణ జూలై 11కు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa