దిశ యాప్ తోనే మహిళలకు రక్షణ అని ఎస్ఐ బి. రాఘవ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు రాప్తాడులోని బస్టాండు, రద్దీ ప్రదేశాలు, ప్రయాణికులకు దిశ యాప్ పై అవగాహన కల్పించి, వారి మొబైల్స్ లో దిశ యాప్ ను డౌన్లోడ్ చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ యువతులు, మహిళలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ ను ప్రవేశ పెట్టారన్నారు.