మూడు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పెద్దరావీడు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మార్కాపురం సీఐ భీమానాయక్ వివరాలను వెల్లడించారు.
దొనకొండ మండలం, రుద్ర సముద్రానికి చెందిన విరెళ్ల వెంకటస్వామి(34) వ్యసనాలకు బానిసై పెద్దరావీడు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, మార్కాపురం స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. ఈ వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.