ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం వాదించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే సుప్రీం ఉత్తర్వులతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల సస్పెన్షన్ ఎత్తి వేసింది. తాజాగా మరోసారి సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa