జగన్ రెడ్డి గారికి జనం ఒక్క అవకాశం ఇస్తే, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన కొంతమంది పోలీసులని సుపారీ గ్యాంగులుగా వాడుతున్నారు వైసీపీ నేతలు అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ మాట్లాడారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు లో జరిగిన సంఘటన మీద స్పందిస్తూ... తెలుగు యువత నేతలు గంజి మాజేష్, గంజి మనోజ్ లపై తప్పుడు కేసులు పెట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓ కేసు దర్యాప్తు కోసమంటూ తీసుకెళ్లి, వైద్యపరీక్షలు పేరు చెప్పి...గంజాయి కేసులో ఇరికించాలని చూడటం దారుణం. చట్టప్రకారం వ్యవహరించని పోలీసులు న్యాయం ముందు దోషులుగా నిలవక తప్పదు అని హెచ్చరించారు.