ఏపీ ప్రభుత్వం 2017లో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి కల్పిస్తుండగా.. దాన్ని రద్దు చేసింది. రేపటిలోగా ఫ్లాట్లు ఖాళీ చేయాలని తెలిపింది. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు నెలల పాటు ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.