భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,819 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13,827 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 39 మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ప్రస్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.16% ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,25,116 మంది కరోనాతో మృతిచెందారు.