ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హద్దులు మీరుతున్న మాటలు , అసలు ప్రజానాయకులేనా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 11:33 AM

నీ లాంటి వాడు రాజ్య సభ సభ్యుడూ గా ఉండకూడదు... తెలుగు ప్రజలకు అవమానం, దోర్భాగ్యం.. ఆయానేమో విదేశం లో వైద్యం చేయించుకున్నారు..నువ్వు స్వదేశం లో  వైజాగ్ లో వైద్యం చేయించుకుంటే పిచ్చి తగ్గుతుంది.పొద్దున లేస్తే ఎవర్ని తిడదామ అని చూడడమే తప్ప ప్రజలకి మంచి చేసే ఉద్దేశము మాత్రం లేదు అని విజయ్ సాయి రెడ్డి ని ఉద్దేశించి టీడీపీ నాయకులూ బుచ్చయ్య చౌదరి ట్వీట్ చెయ్యగా, దానికి సమాధానంగా రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటలో అంటిన రక్తం మరకలు లక్ష మునకలేసినా తొలగిపోవురా బుచ్చిగా. నూరేళ్లు జైలు శిక్ష అనుభవించినా పరిహారం కాదు. దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నీ చూస్తున్నాడు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేసారు. ఇలా  ఒకరిని ఒకరు తిట్టుకోవడం తప్ప ప్రజలకి మేలు చేసే ఆలోచన వీరిలో ఉందొ లేదో గమనించి ఓటు వెయ్యాలని కొంతమంది ప్రజా శ్రేయోభిలాషులు తెలియజేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com