ఒక కాకి చనిపోతే, చుట్టుపక్కల నుండి వంద కాకులు చేరి వాటి భాధను వ్యక్త పరుస్తాయి. కానీ మనుషులలో మాత్రం అలాంటి పరిస్థితులు కనుమరుగై పోయాయి అని చెప్పవచ్చు. కానీ ఇంకా మాతో కలిసి పనిచేసిన వారికీ మేము అండగా ఉంటాం అనేవాళ్ళు ఉన్నారు అంటే నమ్మక తప్పదు. అలంటి సంఘటనే విజయనగరంలో చోటు చేసుకుంది. జిల్లా పోలీసుశాఖ లో HC గా పని చేస్తూ, ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెంది కీ"శే"లు జి.పైడిరాజు (HC 1848) గారి సతీమణి శ్రీమతి అరుణ కుమారి గారికి పోలీసు అధికారులు, సిబ్బంది "చేయూత" గా రూ.1,93,500/- అందజేశారు. ఈ చెక్ ను జూన్ 29న Mrs. M. దీపికా IPS, విజయనగరం DPOలో ఈ కుటుంబానికి అందజేశారు.