తుళ్ళూరు మండలంలో షాపుల వద్ధ ఏర్పాటు చేసిన వైసీపీ బ్యానర్ ను అధికారులు తొలగించారు. తమ షాపులకు అడ్డంగా బ్యానర్ ను ఏర్పాటు చేశారని తుళ్లూరుకి చెందిన శ్రీనివాసరావు, మాధవి దంపతులు స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
స్పందించిన కలెక్టర్ బ్యానర్‌ను తొలగించాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలతో తుళ్ళూరు పంచాయతి కార్యదర్శి శరత్‌బాబు బుధవారం సిబ్బందితో వచ్చి బ్యానర్ తొలగించారు.