రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జామి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన స్వామి నాయుడు (36) అనే వ్యక్తి శృంగవరపుకోటలో తన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామానికి వెళ్తున్న నేపథ్యంలో చింతాడ గ్రామం వద్ద జామి నుండి వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది.
దీంతో స్వామి నాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు జామి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.