పాలకొండ పట్టణంలో జులై- 01నుండి ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అమలులో ఉందని పాలక పాలకొండ కమిషనర్ రామారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో 75 మైక్రాన్ల లోపు మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు నిషేధించినట్టు తెలిపారు. జులై నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కింద ఉపయోగించే ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్తో చేసిన కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ఆహ్వాన పత్రాలు, 100మైక్రాన్ల లోపు ఉండే పివిసి బ్యానర్లు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్ వంటి వస్తువులు నిషేధించినట్టు తెలిపారు.
కావున పట్టణంలోని వ్యాపారులు నిషేధించబడిన ప్లాస్టిక్ కొనడం, అమ్మడం, చేయరాదని, నిల్వ చేయడం మొదలగునవి. చేసినచో చట్టప్రకారం చర్యలు తీసుకొని జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా సహకరించాలని కోరారు, ఇకపై నిత్యావసరాలకు గాని, ఏవైనా వస్తువులు కొనడానికి గాని బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా గన్ని బ్యాగులు వెంట తీసుకెళ్లి పాలిథిన్ నిషేదం పట్ల తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.