పాలకొండలో వెలసిన శ్రీ జగన్నాథ స్వామి యాత్ర మహోత్సవాలు జూలై 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. జులై 1న తొలి దసమి, 2న ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు 3న స్వామి వారుమత్స్యావతారంలో దర్శనమిస్తారు. 4న కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. 5న వరాహ నరసింహ స్వామి అవతారం తో పాటు హీరా పంచమి వేడుకలు నిర్వహిస్తారు. ఆరవ తేదీ వామన పరశురామావతారం, 7న రామ, బలరామ అవతారాలు, 8న కల్కి జగన్మోహిని అవతారం , 9న మారుతి మారుదసిమి, నిజరూప దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. 10న తిరుగు రథయాత్ర 11న సోమవారం ప్రధాన దేవాలయానికి ప్రవేశ కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ. ఓ వి. రాధాకృష్ణ అన్నారు.
ఈ కార్యక్రమాలు ప్రధాన అర్చకులు మఠం విశ్వనాథ దాసు అధ్యర్యం లో స్వామివారి చరిత్ర కథ రూపంలో వివరిస్తారని అన్నారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలను పాటించి స్వామివారి యాత్రలో పాల్గొనాలని కోరారు. ఏర్పాట్లపై ఆర్డీవో సమీక్ష జగన్నాథ రథ జగన్నాథ స్వామి రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించాలని ఆర్డిఓ హేమలత కార్యాలయంలో పోలీస్ రెవెన్యూ దేవాలయ శాఖ నగర పంచాయతీ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు యాత్ర కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆయన అందరిని అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా పోలీస్ బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.