ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి 9రోజులపాటు జగన్నాధుని రధయాత్ర: స్వామి శ్రీనివాసానంద సరస్వతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 08:22 PM

శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురంలో బావాజీ మఠం ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా జగన్నాధ రథయాత్ర యధావిధిగా జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. బొందిలీపురంలోని జగన్నాథ మందిరంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి , రథయాత్ర నిర్వాహకులు బాలకృష్ణ పాణిగ్రాహి , సురేష్ పండాలు మాట్లాడారు. మఠానికి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఈ ఏడాది పీఠాధిపతి రఘువీర్దాస్ మృతి చెందిన కారణంగా రధయాత్రను నిర్వహించడం లేదని చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టారన్నారు. ఆయనకు సంబంధించిన కార్యక్రమాలను కొనసాగిస్తామని , దాని కారణంగా దైవ కార్యక్రమమైన రథయాత్రలను రద్దు చేయడం జరగదని స్పష్టం చేసారు. ఈ మేరకు శుక్రవారం నుంచి 9 రోజుల పాటు రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వివరించారు. తరతరాలుగా బావాజీ మఠం ఆధ్వర్యంలో శ్రీక్షేత్రం తరహాలో తొమ్మిది రోజుల పాటు రథయాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు.


ఈ వేడుకల్లో భక్తులు వేలాదిగా పాల్గొని సుభద్ర , బలభద్ర సమేత జగన్నాధస్వామి వారిని దర్శించుకుంటారని , గత రెండేళ్ళు కరోనా కారణంగా వేడుకలు నామమాత్రంగా నిర్వహించామని , అయితే ఈ ఏడాది వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరిగాయని వివరించారు. రథయాత్రను నిర్వహించకూడదన్న అక్కసుతో కొంతమంది రధాన్ని విరగదీసారని , దీని స్థానంలో వేరే రథాన్ని కూడా సిద్ధం చేసామని వివరించారు. రథయాత్ర నిర్వహణపై భక్తులు ఎటువంటి అపోహలు నమ్మవద్దని , శుక్రవారం నుంచి జరగనున్న యాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. మీడియా సమావేశంలో బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు రావాడ రాజశేఖర్ , విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి శ్రీరంగం మధుసూధనరావులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com