రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై నేడు ఉదయం 11 గంటలకు తుళ్లూరు సిఆర్డిఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనునట్లు రైతు ఐక్య కార్యచరణ సమితి, దళిత జేఏసీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.
రాజధాని రైతులు, అసైన్డ్ రైతులకు టిడ్కో గృహాల అప్పగింతలో జాప్యం జరిగిందని దానికి నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు